ఆంధ్రప్రభ, నిజామాబాద్ ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ వైస్ చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఇవ్వాల (మంగళవారం) నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -
రాష్ట్రవ్యాప్తంగా 11 మంది వైస్ చైర్మన్లను, 9 మంది కన్వీనర్లను నియ మించగా.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దయాకర్ గౌడ్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. 22 ఏళ్లుగా జిల్లాలో ఆయన న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. న్యాయవాదిగా పనిచేస్తూనే దయాకర్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. తన నియామకానికి కృషి చేసిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.