Tuesday, September 17, 2024

NZB: పార్టీ కోసం పనిచేసిన వారిని కాంగ్రెస్ గుర్తిస్తుంది…

తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా మానాల భాద్యతలు స్వీకరణ
నిజామాబాద్ ప్రతినిధి, జులై 11 (ప్రభ న్యూస్) : పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తుందని… అందుకు నిదర్శనమే మానాల మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసి, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడి.. పార్టీ కోసం మానాల మోహన్ రెడ్డి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లభించిందన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని సహకార యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంటు బాధ్యులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొ రేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వెర్ రోహిత్ చౌదరి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందాన్, అగ్రో ఇండస్టిక్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, గడుగు గంగాధర్, నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్ నగర అధ్యక్షులు కేశ వేణు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య, బాల్కొండ సునీల్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వచ్చి మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

సహకార రంగాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..
సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
సహకార రంగాన్ని అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళతానని సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పెద్దలు సుదర్శన్ రెడ్డికి, షబ్బీర్ అలీకి, జీవన్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ కి, పత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, తన మీద నమ్మకంతో తనకు ఇచ్చిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement