నిజామాబాద్ ప్రతినిధి, జులై 6(ప్రభ న్యూస్) : కాంగ్రెస్ డిక్లరేషన్లు అని ఉత్తమాటలేనా ? అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి ,తండ్రి ,భార్యకు 25000 గౌరవ పెన్షన్ ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదని, ప్రతి ఏడాది జూన్ 2నాటికీ అన్ని శాఖల్లో జాబ్ క్యాలండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలండర్ విడుదల చేయలేదని మండిపడ్డారు.
సెప్టెంబర్ లోపు నియామకాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మెగా డీఎస్సీ అని చెప్పి 7 నెలలు గడుస్తున్నా నియామకాలు పూర్తి స్థాయిలో జరగడగం లేదన్నారు. మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం కార్యకర్తలు నిరసనలు చేస్తే పోలీసులతో నిర్భందించి, ముందస్తు అరెస్టులు చేసి, పలు చోట్ల లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే మెగా డీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనీ అన్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలలో పే బీసీ రిజర్వేషన్లు పెంపోందిస్తామని అలాగే కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న BC రిజర్వేషన్ 23% నుండి 42% కి పెంచుతాం అన్న హామీని వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. అలాగే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ కేటాయింపు హామీ హామీగానే ఉందని గత ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తానని 10 ఏళ్ళు మోసం చేసి, కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కూడా అదే తోవలో పోతుందని అన్నారు.
పాత కలెక్టర్ కార్యాలయంలో 12 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని జిల్లాలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారికీ ఉపయోగకరంగా ఉంటుందని భోధన్ బస్టాండ్ కాంప్లెక్స్ వంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందనన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, కార్పొరేటర్స్ ఎరం సుధీర్, మాస్టర్ శంకర్, మరియు అసంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, బీజేపీ ఆఫీస్ సెక్రటరీ బద్దం కిషన్, మండల అధ్యక్షులు గడ్డం రాజు,పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు, ప్రభాకర్,ఆనంద్, పవన్, కార్తీక్, ఖైజార్, అంబదాస్,హరీష్, భూమేష్, వెంకటరమణ పాల్గొన్నారు.