నిజామాబాద్ ప్రతినిధి, మే 17 (ప్రభా న్యూస్): అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌లో చెత్తసేకరణను నిలిపివేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించేంత వరకు చెత్తసేకరణ నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. సమస్యలపై అధికారులకు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవిం చిన ఎవరూ పట్టించుకోవ డంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు తెలిపారు. మరోవైపు రోజు వారి చెత్తసేకరణకు వచ్చే వాహనాలు రాకపోకవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తసేకరణ జరగకపోతే అపరిశుభ్రత పెరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.