Monday, July 8, 2024

NZB: జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్..

నిజామాబాద్ ప్రతినిధి, జులై 5(ప్రభ న్యూస్) : జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం జిల్లా పరిషత్ కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో ఉష, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఇతర అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement