నిజామాబాద్, మార్చి 11 (ప్రభ న్యూస్) : పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఔట్ లెట్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చేందుకు వీలుగా నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రైవేటు పెట్రోలు బంక్ ల కంటే కూడా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే ఔట్లెట్లు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పోలీ సు కుటుంబాల సంక్షేమానికి వెచ్చించాలని నిర్ణయించడం ఎంతో గొప్ప విషయమని పోలీస్ కమిషనర్ కల్వేశ్వర్ సింగినవార్ ను అభినందించారు.
పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ… ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పోలీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో నిర్వహించే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పూర్తిగా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్ సి.జి.యం శుభ్ర త్ రత్ మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఐ.ఓ.సి ఔట్ లెట్ ప్రారంభించడం ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబెషనరీ ఐ.పి.ఎస్. బి.చైతన్య రెడ్డి, సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్, నిజామాబాద్ ఆర్మ్ డ్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, నాగయ్య, నిజామాబాద్ ఐ.ఓ.సి.సి.ఎల్ ఆఫీసర్ క్రాంతి కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.