Monday, July 1, 2024

NZB: కూలిన ప్రహరీ గోడ… తప్పిన పెను ప్రమాదం…

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 27(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా పక్కనున్న భవనానికి సంబంధించిన ప్రహారీ కూడా అకస్మాత్తుగా కూలిపోయింది. గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రగతి హాస్పిటల్ పక్కన ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు.

ఇవాళ‌ ఉదయం పక్కనున్న భవనానికి సంబంధించిన ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఇంటి నిర్మాణ పనులు చేపట్టే గుత్తేదారుడి నిర్లక్ష్యంతోనే జరిగిందా ? ఈ సమయంలో కార్మికులు ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి!

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement