నిజామాబాద్ పసుపుబోర్డుపై మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. తెలంగాణలో పసుపుబోర్డు పెట్టే ప్రసక్తేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుగంధద్రవ్యాల బోర్డు ఉన్నందున పసుపుబోర్డు ఏర్పా టు సాధ్యంకాదని వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో పసుపుబోర్డు ఓ కీలక అంశం. నిజామాబాద్ పార్ల మెంట్ స్థానంలో గెలుపోటములను తారుమారుచేసిన డిమాండ్ ఇది. 2019 నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలలో.. పసుపుబోర్డు సాధన అంశం ప్రధాన డిమాండ్ కాగా, తాను గెలిస్తే పసుపు బోర్డు వెంటనే తెస్తానని ఎంపీ అరవింద్ హామీనిచ్చారు. దీనిపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. రైతులు ఆ ఎన్నికల్లో ఏక పక్షంగా అరవింద్‌కు మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో అర వింద్ గెలవగా, పసుపుబోర్డుపై హామీనిలబెట్టాలని కోరడంతో దానికి బదులు నిజామాబాద్‌కు స్పైసీ బోర్డు తెచ్చానని చెప్పారు. అయితే తమకు పసుపుబోర్డే కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పసుపుకు ధర పెరిగినా, అది అందరికీ రావడం లేదని పసుపుబోర్డు వస్తే అందరికీ కలుగుతుందని రైతులు ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర వ్యవ సాయశాఖ మంత్రి తాజాగా ఇచ్చిన సమాధానం ఇందూరులో పసుపుమంటలు పుట్టించే అవకాశం ఉంది. రాష్ట్రంలో గత ఏడాది 55,444 ఎకరాల్లో పసుపుసాగు చేయగా, 3.86లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. పసుపు క్వింటాకు కనీసం రూ.14వేలు గిట్టుబాటు కావాలని రైతులు కోరుకుంటున్నారు. పసుపుబోర్డు సాధన డిమాండ్‌ను కొనసాగిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement