Saturday, November 23, 2024

డమ్మీ పిస్టల్ తో బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఏవన్ బార్ మేనేజర్ మేనేజర్ ను డమ్మీ పిస్టల్ తో బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ నరేష్ తెలిపారు. డమ్మీ పిస్ట‌ల్ కలిగి ఉన్న కామారెడ్డి పట్టణo ఆజామ నగర్ కు చెందిన ఎండి రఫీక్ ను పోలీసులు అరెస్టు చేశారు. రఫిక్ పై 385 సెక్షను కింద పోలీస్ లు కేసు నమోదు చేశారు. అక్రమంగా గన్ కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఐ హెచ్చరించారు. రఫిక్ వద్ద ఎయిర్ గన్ గా పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో గన్ లైసెన్స్ 27 మంది కలిగి ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. గతంలో రఫిక్ పై బంధువులు దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆన్ లైన్ లో ఎయిర్ గన్ కొనుగోలు చేశారని టౌన్ సిఐ తెలిపారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరికైనా ప్రాణానికి ప్రమాదం ఉంటే, ఇంకా ఏదైనా అపాయాలు, ఇబ్బంది ఉంటే పోలీసులను ఆశ్రయించాలని కానీ, సొంతంగా తుపాకులు ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదని ఎస్పీ శ్రీనివాస రెడ్డి సూచించారు. గతంలో ఇలాగే తుపాకితో బెదిరించిన రౌడీషీటర్ సాజిద్ పై పీడీ యాక్టు పెట్టి జైల్లో పెట్టామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా జిల్లాలో ఎవరూ గన్నులు ఉపయోగించరాదని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement