Monday, July 8, 2024

NZB: వ్యాపార, వాణిజ్య సంస్థలు కార్పొరేషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి…

నిజామాబాద్ ప్రతినిధి, జులై 5(ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు కార్పొరేషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని.. లేకుంటే చర్యలు తప్పవని డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ రెవెన్యూ బృందం నగరంలోని పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటల్స్, మాల్స్ లలో జాయింట్ సర్వే చేపట్టారు.

నగరంలోని హెచ్.గంగారం, ఢిల్లీ వాలా స్వీట్ హోమ్, రిలయన్స్ మాల్, వేస్ట్ సైడ్ షోరూం వ్యాపార సంస్థల్లో కొలతలు నిర్వహించి పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, యూజర్ ఛార్జీల చెల్లింపు ధ్రువపత్రాలను పరిశీలించి నిబంధ నలు పాటించని వాణిజ్య సంస్థలకు నోటీసులు అందజేశారు. మాల్ లో ఆహార పదార్థాల పరిశుభ్రత, కిచెన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ వో సాజిద్ అలీ, రెవెన్యూ అధికారి నరేందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement