Tuesday, November 26, 2024

పోలీస్ స్టేషన్ లో అధికార పార్టీ నేతల డీష్యుం..డీష్యుం – వీడియోతో…

ఎడపల్లి, ప్రభా న్యూస్; వారంత ఓకే తరగతి నుంచి చిన్ననాటి స్నేహితులు, రాజకీయలలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు . ఇంతలో వారి మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ డీష్యుం.. డీష్యుం చేసుకునే స్థాయికి చేరుకుంది.వివరాల్లకి వేళితే ఎడపల్లి గ్రామంలో పంచాయితీ కబ్జా స్థలాలపై ఆ గ్రామానికి చెందిన గుర్తింపు లేని ఓ పాత్రికేయుడు మండల అధికారులకిచ్చిన ఫిర్యాదు చేశారు. అతని వేదింపులపై గురువారం గ్రామ ఎంపిటిసి షేక్.బాబా ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక ఎంపిపి శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు భర్త ఎల్లయ్య యాదవ్, ‌ఉప సర్పంచ్ అకుల ‌శ్రీనివాస్ ,మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు దేరడి శ్రీరాం లతో కలిసి స్టేషన్ వచ్చారు. ఇంతలో సరదాగా కలిసి మాట్లాడుతుండగా ఈమధ్య ఎడపల్లి గ్రామానికి చెందిన బిజేపి నాయకులు ఒకరు పోలీసు స్టేషన్ కు టీవి విరాళంగా ఇచ్చిన రోజు స్థానిక అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ విషయం పై బిఆర్ ఎస్ అధ్యక్షుడు దేరడి, ఉప సర్పంచ్ అకుల ‌శ్రీనివాస్ మధ్య జరిగిన మాట మాట పెరిగి ఘర్షణ పెట్టుకునే స్థాయికి చేరింది.ఓకపై ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అంటు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో. ఎస్సై పాండే రావు సాక్షిగా నేతల కుమ్ములాట జరిగింది.

అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ మండల ప్రజల్లో హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు వైరల్ అవుతునే ఉంది. వెంటనే ఎస్సై స్థానిక పోలీస్ సిబ్బంది ని పిలిచి నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు .

నేను ఊహించలే.. ఎస్సై

అప్పటివరకు కలిసి స్టేషన్ కు వచ్చిన ఆ నాయకులు ఒక్కసారి గా అనుకోని విషయం పై ఇంత వివాదానికి దారితీస్తుదని నేను ఊహించలేదని ఎడపల్లి ఎస్సై పాండేరావును వివరణ ఇలా చెప్పారు. ఘర్షణ పడ్డ నేతలను మా సిబ్బంది ని పిలిచి క్షణాల్లో అక్కడి నుంచి నాయకులందరిని పంపించానన్నారు.

- Advertisement -

స్థానిక ఎమ్మెల్యే గాడిలో పెట్టాల్సిందే

ఎడపల్లి మండల బిఆర్ ఎస్ నేతల మధ్య కోనసాగుతున్న అంతర్గత యుద్ధం పై స్థానిక ఎమ్మెల్యే షకీల్ చోరవచూపి గాడిలో పెట్టాల్సిందే అవసరం ఎంతైనా ఉందని కోండ్రు ఆపార్టీ నేతల అభిప్రాయం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి ఇలాంటి ఘటనలు పార్టీ నేతల బహిరంగ పరస్పర ఘర్షణలు ఏట్ఉ దారితీసే నో అర్థం కాని దుస్థితి. ఏది ఏమైనా నేతల మధ్య అంతర్గతంగా ఉన్న కలహాలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ సాక్షిగా బహిర్గతం అవడంపై మండలం లో చర్చనీయాంశంగా మారింది

Advertisement

తాజా వార్తలు

Advertisement