Tuesday, November 26, 2024

NZB: గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీలు… కేతావత్ యాదగిరి

నిజామాబాద్, ఏప్రిల్ 3(ప్రభ న్యూస్) : గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీలకు గిరిజనులు బుద్ధి చెప్పాలని, ఈ నెల 7న నిజామాబాద్ లో నిర్వహించే గిరిజన బంజారా సమావేశానికి గిరిజన ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు, జిల్లా ఆదివాసీ గిరిజన అధ్యక్షులు కేతావత్ యాదగిరి కోరారు.

బుధవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతావత్ యాదగిరి మాట్లాడుతూ.. ఏప్రిల్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రాలలోనీ బృందావన్ గార్డెన్ లో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఆది వాసీ గిరిజన సమావేశం ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డితో పాటు బంజారా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు హాజరుకా నున్నారన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామో అదే విధంగా లోక్ స‌భ‌ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించుంకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి, తండాల నుంచి ప్రతి ఒక్క గిరిజనలు హాజరు కావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆదివాసీలు, లంబాడా సోదరులు అందరూ పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

రాష్ట్ర స్థాయి బంజారా సేవ సంఘం కార్య నిర్వాహక అద్యక్షులు, రాంపూర్ పి ఎ సీ ఎస్ చైర్మన్ తారచంద్ మాట్లాడుతూ.. గిరిజన ఆదివాసీ అధ్వర్యంలో ఐదు నియోజక వర్గాల పరిధిలో అదివాసి గిరిజన సమావేశానికి విచ్చేసి మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరై బంజరుల ఐక్యతను చాటాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ కూడా బంజారాల సమస్యలపై పోరాడ‌లేదని, ఏ ఒక్క తండాకు వెళ్లి మన బాధలు, గాథలు వినలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే మన సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ పట్టణ అద్యక్షులు సుభాష్ జాదవ్, మల్కాపూర్ మాజీ సర్పంచ్ ప్రకాష్ నాయక్, రాజు, ఆదివాసీ వైస్ చైర్మన్ బాల్ రాజు నాయక్, ధర్పల్లి మండల అధ్యక్షుడు మంగ్త్య నాయక్, రూరల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్, మోపాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షులు రవీందర్, వినోద్, దాదు రావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement