నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలపై NIA సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 23 బృందాలతో NIA సోదాలు చేపట్టింది. PFI జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు పెట్టినట్లు తెలుస్తోంది. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో పీఎఫ్ఐ కార్యకలాపాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ ఎమ్మెల్యే పై కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. హవాలా, విదేశాల్లో వ్యాపారంతో పాటు సంబంధాలపై అరా తీస్తున్నారు. మతకలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు NIA గుర్తింది. ఎడపల్లి మండల కేంద్రంలో ఆన్ లైన్ సెంటర్ నడిపే యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి విచారణ చేపట్టారు. పలు డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. బైంసా అల్లర్లతో సంబంధాలపై సైతం ఆరా ఉన్నాయి NIA బృందాలు. ఆటోనగర్‌లో డిగ్రీ విద్యార్థిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. విద్యార్థి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు…
ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారంకు చెందిన శైక్ ముకీం ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. అనుమానాస్పద వ్యక్తులకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని సమాచారంతో ఈ సోదాలు జరిపింది. ఆర్మూర్ లోని జిరాయత్ నగర్ కి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విదేశాల నుంచి లావాదేవీలు జరుపుతున్నారనే సమాచారంతో ఈ ఇద్దరి వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ విచారణ ఆధారంగా నందిపేట్, నవిపేట్ లో కూడా ఆకస్మిక దాడులు చేయనున్నారు.