Home తెలంగాణ‌ నిజామాబాద్ NZB | ఆనాడు బలి దేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లాయింది : ఎమ్మెల్యే ధన్ పాల్

NZB | ఆనాడు బలి దేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లాయింది : ఎమ్మెల్యే ధన్ పాల్

0
NZB | ఆనాడు బలి దేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లాయింది : ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బలి దేవత సోనియామ్మ అని నేడు తెలంగాణ తల్లి ఎట్లాయిందని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియమ్మ పుట్టిన రోజున ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్ పాల్ సూర్యనా రాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు…

సోనియమ్మ పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సోనియా జన్మదిననా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు గోషిస్తాయని వాపోయారు. తెలంగాణ విగ్రహం మార్పులో తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణకి ప్రతీక అయినా బతుకమ్మ పెట్టకపోవడం తెలంగాణను అవమానించినట్లే అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంలో ఉన్న శ్రద్ద తెలంగాణ ప్రజలపైన లేదని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను జోకడంలోనే వాళ్ళ సంవత్సర కాలం గడిచిపోయిందని ఏద్దేవా చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఎగవేయడానికే సర్వే పేరుతో, ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన గ్యారంటీల అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేసారు.

Exit mobile version