రెంజల్, ప్రభన్యూస్: ఏడాది కాలం నుండి గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు 15 రోజుల్లో చెల్లించకపోతే తమ పదవులకు రాజీనామా చేసేందుకు వెనకాడాబోమని తెగేసి చెప్పారు.మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల సర్పంచులు సమావేశమయ్యారు.పలు రకాల సమస్యలపై చర్చించిన సర్పంచులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని ఎంపీడీవోతో మాట్లాడారు. ప్రభుత్వం పారిశుద్ధ్య వారోత్సవాలు జరపాలని సూచించిందని,తమ బకాయి బిల్లులపై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు పనులు జరుపబోమని ఎంపీడీవో శంకర్ కు వివరించారు.విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ ఆవేదనను చెప్పాలని కోరారు.15 రోజుల్లో సర్పంచుల సమస్యల పట్ల ప్రభుత్వం,అధికారులు స్పందించకపోతే పదవులకు రాజీనామా చేసి తీరుతామని స్థానిక సర్పంచ్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్లషికారి రమేష్ కుమార్ ఎంపీడీవోకు వివరించారు. ఆయన వెంట సర్పంచులు బైండ్ల రాజు,జాదవ్ గణేష్, పాముల సాయిలు, నాయకులు రాఘవేందర్,కాశం సాయిలు,రోడ్డ లింగం,విజయ్, నర్సయ్య,వసంత్,కృష్ణయ్య ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement