గ్రామాలు, పట్టణాల్లోకి వన్య ప్రాణులు చొరబడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దపులి, ఎలుగుబంటి, అడవి పంది, కోతి, చిరుత వంటి వన్య ప్రాణుల వల్ల మనుషులకు, పశువులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధ రామేశ్వర ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. సిద్ధరామేశ్వర ఆలయం నుంచి సమీపంలోని రైల్వే గేటు వైపునకు ఎలుగుబంటి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు గుర్తించారు. ఎలుగుబంటి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు రైల్వేగేట్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement