Sunday, November 24, 2024

NZB | నూతన జీపీగా బాకర్ ఫారం.. మరో ఏడింటికి సభాపతి సిఫారసు

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి పోతంగల్ మండలాల్లో మరో ఏడు గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసేందుకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సిఫారసు చేశారు. ఓకే గ్రామపంచాయతీలో మూడేసి గ్రామాలు ఉండడం గ్రామపంచాయతీ కార్యాలయాలు కిలోమీటర్ల నుండి రెండు కిలోమీటర్లు ఉన్న కార్యాలయాలు ప్రజలకు ఇబ్బందులుగా మారడం స్థానిక ప్రజలు తమ గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని సభాపతి దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో పోతంగల్ మండలంలోని బాకర్ ఫారం, జల్లపల్లి తాండ, జల్లాపల్లి కోటగిరి మండలంలో ఎత్తొండ క్యాంప్ , ఏ క్లాస్ పూర్ క్యాంప్, వర్ని మండలంలోని రూపులా నాయక్ తాండ, రుద్రూర్ మండలంలోని కొందాపూర్ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను స్పీక‌ర్‌ పోచారం ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలో భాకర్ ఫారం దిగుపారం మూడు గ్రామాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement