Saturday, December 21, 2024

NZB | నయనానందకరంగా మణికంఠుడి మహా పడిపూజ..

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం పూర్వజన్మ సుకృతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అయ్యప్ప మాల ధరించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.

నగరంలోని వినాయక్ నగర్ లోకి సాన్ హైట్స్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ నయనానందకరంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో వినాయక్ నగర్ ప్రాంతమంతా మార్మోగింది…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు.. హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి నడవడిక మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అన్నారు. తమ కుటుంబం నుండి గత 20 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అది తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న నాటి నుండి కఠినమైన నియమ నిష్టలతో దైవ ఆరాధనలో ఎలాగైతే ఉంటారో దీక్ష అనంతరం కూడా హిందూ ధర్మం రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

స్వామి వారి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు..

- Advertisement -

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి డాక్టర్ వినయ్ మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించడం అంటే ఎన్నో జన్మ జన్మల పుణ్య ఫలం అని అన్నారు. . స్వామి వారి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదన్నారు. ఇందూరులో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మహా పడిపూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. అయ్యప్ప స్వాములు ఈ మహా పడిపూజలో అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. అయ్యప్ప స్వాముల సంకీర్తన, పెటతుల్లయ్యాట ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement