Wednesday, November 27, 2024

NZB | బాబోయ్ ఆటో డ్రైవర్లు.. వృద్ధులే టార్గెట్

నిజామాబాద్ (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి నగదు, బంగారం దోచుకుంటున్న ఆటోడ్రైవర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ నరహరి తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు ఆటో డ్రైవర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయ‌న తెలిపారు.

పూలాంగ్ ప్రాంతానికి చెందిన అశ్ఫక్ హైమర్, అజాజ్ ఖాస్లు ఇద్దరు కలిసి ఈనెల 22న కోర్టు చౌరస్తాలో ఒక వృద్ధుడిని శ్రీనివాస్ నగర్ వెళ్లాలని అతనిని ఆటోలో ఎక్కించుకొని బయలు దేరారు. అయితే శ్రీనివాస్ నగర్ కాలనీకి తీసుకెళ్లకుండా బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వృద్ధుడిని తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. వృద్ధుడి వద్ద నుంచి 2000 నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు. దీంతో బాధితుడు స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మంగళవారం తనిఖీల్లో భాగంగా నగరంలోని శివాజీచౌక్‌లో అనుమానాస్పదంగా కనిపించిన అష్ఫాక్ హైమర్, అజాజ్ ఖస్లులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద రూ.1500.. ఒక‌ సెల్ ఫోన్, దోపిడీకి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ నరహరి తెలిపారు. ఈ కేసులో చాకచ క్యంగా వ్యవహరించిన ఎస్ఐ ప్రవీణ్ ను.. మూడో పట్టణ సిబ్బందిని సిఐ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement