Saturday, October 5, 2024

నల్లవెల్లిలో యువకుని పై గొడ్డలితో దాడి.. పాత కక్ష్యలే కారణమా..?

ఇందలవాయి, (ప్రభ న్యూస్) : మండలంలోని నల్లవెల్లి గ్రామంలో పాత కక్ష్యలను మనసులో పెట్టుకొని వ్యవసాయ పొలం వద్ద గొడ్డలితో తలపై కొట్టినా సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తీవ్ర గాయాల పాలైన సంఘటన నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం నల్లవెల్లి గ్రామానికి చెందిన పిన్నేo తిర్మల్ గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్ళాడు. వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో అదే గ్రామానికి చెందిన సాకలి చరణ్ కాపు కాసి వెంటాడి గొడ్డలితో తలపై తీవ్రంగా కొట్టాడనీ స్థానికులు తెలిపారు. తల, కడుపు బాగంలో తీవ్ర గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావం జరగడంతో విషయం తెలుసుకున్న కుటుంబీకులు చికిత్స కోసం ఇందలవాయి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఇరువురూ కుటుంబాల మధ్య గతంలో కూడా పలు సార్లు గొడవలు జరిగాయని పాత కక్ష్యాల తోనే ఈ దాడి జరింగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గతంలో కూడా సాకలి చరణ్, పిన్నేం తిర్మల్ పై రెండు సార్లు దాడి చేశాడని, ట్రాక్టర్ అద్దాలు పగల కొట్టడం జరిగిందని అదే క్రమంలో మళ్ళీ హత్య ప్రయత్నం చేశాడని కుటుంబీకులు తెలిపారు. హత్య ప్రయత్నంతో పాటు ట్రాక్టర్ ను ద్వంసం చేశాడని పేర్కొన్నారు.. పోలీసులే మా కుటుంబానికి రక్షణ కల్పించాలని, మాకు ప్రాణభయం ఉందని పోలీసులకు క్షేత గాత్రుని బార్య పిన్నెం రాధ పిర్యాదు చేశారు.బార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ నరేష్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement