Monday, November 18, 2024

NZB: సేవకు మారుపేరు ఆర్యవైశ్యులు…

సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకం..
దానధర్మాల్లో కూడా ముందుండేది ఆర్యవైశ్యులే…
వైభవంగా వనభోజన మహోత్సవం
రఘునాథ ఆలయ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా…
నిజామాబాద్ ప్రతినిధి, జులై 7(ప్రభ న్యూస్): సేవకు మారుపేరు ఆర్యవైశ్యులని… సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులు ముందుంటారని రఘునాథ ఆలయ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా అన్నారు. నిత్యాన్నదాన సత్రాలు, ఆరోగ్య శిబిరాలు, పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని రఘునాథ రామాలయంలో నిర్వహించిన వన భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఈ వనభోజన మహోత్సవంలో పాల్గొని ఎంతో ఉల్లా సంగా ఉత్సాహంగా ఆటలు ఆడారు.

ఈ కార్యక్రమానికి రఘునాథ ఆలయ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణ సంఘం ఆధ్వ ర్యంలో ముక్క దేవేందర్ గుప్తా ను శాలు వాతో ఘనంగా సన్మానించారు. అనంత రం ఏడువారాల నగలతాంబూల, వివిధ ఆట పోటీలను నిర్వహించారు. విజే తలకు పట్టణ సంఘం సభ్యులు బహుమతులను ప్రధానం చేశారు. అదేవిధంగా పట్టణ సంఘం అనుబంధ సంఘాలైన వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు కొండవీర శేఖర్ గుప్తా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ సభ్యులు ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement