నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి (ప్రభ న్యూస్ )27: కల్లబోల్లి మాటలు చెప్పి ఎక్కువ జీతం ఇప్పిస్తామంటూ నా భర్తకు ఆశ చూపి మోసం చేసిన గల్ఫ్ ఏజెంట్ పై చర్యలు తీసుకొని నా భర్తను నా ఇండి యాకు రప్పించి మా కుటుం బాన్ని ఆదుకోవాలని గల్ఫ్ బాధితురాలు సదరపల్లీ సవిత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మొరపెట్టు కున్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు తరలివ చ్చారు. ప్రజావాణిలో కలెక్టర్ తో తమ గోడును వెళ్లబుచ్చు కున్నారు. బాధితురాలు సవిత ముగ్గురు చిన్నారులు మాడాడీ ని మా ఇంటికి వచ్చేలా చూడండి అని వేడుకుంటున్న తీరును చూసి పలువురిని కంటతడి పెట్టించిం ది.
ఈ సందర్భంగా గల్ బాధితురాలు మాట్లాడుతూ నగరంలోని వినాయక్ నగర్లో గల హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటామని తెలిపారు. సాయికుమార్ అనే నా భర్తకు సౌదీలో పెట్రోల్ మెకానిక్ విభాగంలో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తా నంటూ గల్ఫ్ ఏజెంట్ అయిన డికం పల్లి పోశెట్టి అతని కుమారుడు దీపక్ లక్ష రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. నా భర్తను సౌదీకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ లేబర్ పని చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఆ పని చేయ లేక నా భర్త సాయికు మార్ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని వాపోయారు. కనీసం అక్కడ నా భర్త కు తిండి కూడా పెట్టడం లేదని పేర్కొన్నారు. ఒక పని చెప్పి ఇంకో పని చేయించడం ఏమిటని గల్ఫ్ ఏజెంట్ నీ ప్రశ్నించారు. నా భర్తను సౌదీ నుంచి ఇండియాకు రప్పించాలని గల్ఫ్ ఏజెంట్ అడిగితే పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని మా పరిస్థితి ఏమిటని కన్నీటి పర్యంతమయింది. దయచేసి విచారణ చేపట్టి నా భర్తను మా ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకొని మా కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కోరారు.