నిజామాబాద్ క్రైమ్ : (ఆంధ్రప్రభ) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థలో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్ రూంకి వెళ్లి వచ్చిన విద్యార్ధి పొరపాటును ఫ్యాంట్ జిప్ వేసుకోకపోవడంతో ఆ తరగతి అధ్యాపకుడు అతడిని అందరిముందు అవమానపరిచాడు. వివరాలలోకి వెళితే…..
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ బ్రాంచ్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న తన్మయి అనే విద్యార్థి పాఠశాలలో తరగతులు కొనసాగుతుండగా బాత్రూం రావడంతో బాత్రూంకి వెళ్ళా డు. తరగతులు పూర్తైతాయనే హడావుడిలో… పాయింట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయి క్లాస్ రూమ్ కి వచ్చాడు.
దీంతో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థి జీప్ పెట్టుకోకవడం పెద్ద నేరంగా చిత్రీకరించి అవహేళనగా మాట్లాడుతూ కించపరిచాడు. అంతేకాకుండా సదరు విద్యార్థిని స్టేజిపైకి ఎక్కించి.. జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడంటూ ఇలా చూడండి అంటూ తోటి స్నేహితుల మధ్య అందరూ నవ్వుకునేలా కాసేపూ విద్యార్థిని స్టేజిపైనే ఉంచాడు. దీంతో విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురై బాధపడ్డాడు.
పాఠ శాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా పలుమార్లు బోరున ఏడ్చాడు. తల్లి దండ్రులు అడిగిన విషయం మాత్రం చెప్పలేదు. ఇటు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పలేక.. అటు స్నేహితులకు మొఖం చూపించలేక కోన్ని రోజులపాటు తల్లడిల్లిపోయాడు.
అంతటితో ఆగ కుండా పలుమార్లు బంగ్లా పైకి ఎక్కి ఆత్మహత్య యత్నం చేయడానికి ప్రయత్నించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పదే పదే ఏడ్చుకుంటూ బంగ్లాపైకి ఎందుకు వెళ్తున్నావని తల్లిదండ్రులు ప్రశ్నించిన విద్యార్థి సమాధానం చెప్పలేడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీయగా విషయం కాస్త తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషయంపై పాఠశాలలో ఇన్చార్జికి అడగగా విచారణ చేపడతామని మాట దాట వేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనపై పాఠశాల స్పందించకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయం కొసం ..
తమకు జరిగిన విషయమై న్యాయం చేయాలని 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి జరిగిన అమానుష ఘటనపై పూర్తి విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ వెంటనే స్పందించి న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.
అదేవిధంగా ఆన్లైన్లో బాలల హక్కుల చట్టాలకు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు విద్యార్థి నివాసానికి వచ్చారు. విద్యార్థితో ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.