Tuesday, November 26, 2024

NZB: 7500 కలశాల్లో అమృత కలశ యాత్ర.. దన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్) : మేరీ మట్టి.. మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని నలుమూలల నుంచి 7500 కలశాల్లో మట్టిని అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకెళ్లడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మట్టితో పాటు మొక్కలను తీసుకెళ్లడం జరుగుతుందని ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కు గొప్పగా నిలుస్తుందన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ మండల శాఖ ఆధ్వర్యంలో మేరీ మట్టి.. మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా 34వ డివిజన్ లో ఇంటింటా మట్టి సేకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… రాబోయే 25 సంవత్స రాలు భారతదేశపు అమృతకాలమని గత ఏడాది స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారని తెలిపారు. భారత సంకల్పాలను నెరవేర్చడానికి ప్రమాణం చేయాలన్నారు. ఈ పవిత్రమైన మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం పక్కన అమృత వాటికను నిర్మిస్తున్నారన్నారు. ప్రతి భారతీయుడు ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరారు. మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో పాల్గొని చేతితో కలశాలు పట్టుకొని సెల్ఫీలను దిగారు. ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రజలతో మాట్లాడుతూ… పవిత్రమైన మట్టిని సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోర, బంటు ప్రవీణ్, పవన్ ముందడ, మారెడ్డి వనిత సురేష్, మల్లేష్ గౌడ్, రాజేందర్ హరీష్ రావత్, సంజయ్ పురోహిత్, భట్టికారి ఆనంద్, 34 డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement