Monday, November 18, 2024

NZB: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి..

సాంకేతిక లోపంతో సతమతమవుతున్న రైతులు
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బినోల సొసైటీ పాలకవర్గం వినతి


నవీపేట్, సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్) : రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ అర్హులైన రైతులందరికీ వర్తింపజేయాలని బినోల సొసైటీ మగ్గరి హన్మండ్లు కోరారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల బోధన్ ఎమ్మెల్యే నివాసంలో బినోల సొసైటీ సభ్యులు మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని బినోల సొసైటీ పాలకవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. రైతు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా సొసైటీ చైర్మన్, సభ్యులు మాట్లాడారు. బినోల సొసైటీ పరిధిలో కొందరు రైతులు సాంకేతిక లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జిల్లా డీసీసీబీ బ్యాంక్ అధికారులతో మాట్లాడి సాంకేతిక లోపం, రైతులకు రుణమాఫీ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.

- Advertisement -

ఆందోళన చెందొద్దు.. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వస్తుంది.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వస్తుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బినోలా సొసైటీ పాలకవర్గం వినతిపత్రం అందజేయడంతో వెంటనే స్పందించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… అర్హులైన రైతులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే మోకన్ పల్లి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యదావిధిగా మోకన్ పల్లి సొసైటీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ.. బినోల సొసైటీ పరిధిలోని రైతులకు రుణమాఫీ సాంకేతిక లోపాల సమస్యలపై పాలకవర్గం సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా డీసీవో డీసీసీబీ బ్యాంక్ సీఈవోలకు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు విజయ్, ఆంజాగౌడ్, గంగాదర్, ప్రదీప్ రావు, బాలు చందర్, రమణ రావు, నవీన్ రావు, గంగాదర్, సంపూర్ణ శ్రీనివాస్, సీఈవో రమేష్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement