Wednesday, November 13, 2024

NZB: బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ యాదిరెడ్డి

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) పి.యాదిరెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన బి.చంద్రశేఖర్ ను సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగిన యాదిరెడ్డిని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement