Sunday, November 24, 2024

NZB | నిబంధనలు పాటించకుంటే చర్యలు.. 63 వాహనాలు సీజ్

నిజామాబాద్ ప్రతినిధి(ప్రభన్యూస్) : వాహనదారులు ట్రాఫిక్, రవాణా శాఖ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు (గురువారం) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖ, RTA శాఖ ఆధ్వర్యంలో కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఉమా మహేశ్వరరావు, ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణ్‌ పాల్గొని సరైన వాహన పత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిని.. తదితర నిబంధనలు పాటించని, సరైయిన వాహన ధ్రువపత్రాలు లేని 63 వాహనాలను సీజ్ చేసి వ‌న్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి, ట్రాఫిక్‌ ఏసీపీ తెలిపారు… వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

వాహనాదారులు వాహనాలు న‌డిపేట‌ప్పుడు త‌ప్ప‌కుండా హెల్మెట్, సీటు బెల్టు ధరించి వాహనాలు నడపాలని, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ… తేదా మద్యం సేవించి వాహనాలు న‌ప‌రాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నిబంధ‌న‌లు పాలిస్తూ సహకరించాలని కోరారు. వాహనాల నంబర్లను ట్యాంపరింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, పెద్ద శబ్దాలు వచ్చేలా వాహనాలకు అదనపు సైలెన్సర్లు అమర్చడంతోపాటు శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. వాహనాల ప్లేట్ నంబర్లను ట్యాంప‌రింగ్ చేస్తే వాహనాల డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

పోలీస్ శాఖ, ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో సంయుక్త స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ‌న్ టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ విజయబాబు, రవాణా శాఖ అధికారులు శ్రీకాంత్‌, రాహుల్‌ ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ, ట్రాఫిక్‌, పోలీస్‌, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement