Tuesday, November 19, 2024

NZB: కల్తీ ఫుడ్ పై అధికారుల కొరడా…

అరోమా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు…
లేబల్ లేని నూడుల్స్ ప్యాకెట్లు… బిర్యానీ, మాంసం సీజ్…
నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 8(ప్రభ న్యూస్) : చూస్తే నోరూరె.. తింటే కంగారే.. అన్నచందంగా తయారైంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్ల పరిస్థితి. శనివారం నిజామాబాద్ నగరంలోని కల్తీ ఫుడ్ పై అధికారులు కొరడా ఝులిపించారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు, కంట్రోలర్ నగరంలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు.

నగరంలోని హైదరాబాద్ రోడ్డు వద్ద గల అరోమా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అరోమా రెస్టారెంట్ వంటశాలను పూర్తిగా పరిశీలించారు. ఈ దాడిలో నిలువ ఉంచిన చికెన్, ఫిష్ మాంసం, కలరు వాడిన బిర్యానీ, అధికారులు స్వాధీనం చేసు కుని చెత్తబుట్టలో వేశారు. అదేవిధంగా నగరంలోని పలు రెస్టారెంట్లను కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement