Tuesday, September 17, 2024

NZB: హైడ్రా తరహాలో రామ్మార్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి..

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 27(ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లిలో గల రామ్మార్తి చెరువు పూర్తిగా అన్యాక్రాంతానికి గురైందని, హైడ్రా తరహాలో రామ్మార్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జా కోరల్లో నుంచి చెరువుని కాపాడాలని అర్సపల్లి విలేజ్ కమిటీ, రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం కబ్జా కోరల్లో చిక్కుకున్న రామ్మార్తి చెరువును అర్సపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు, రైతులు సందర్శించి చెరువు వద్ద ధర్నా చేపట్టారు.

చెరువుని కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామ్మార్తి చెరువు 30ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలిందని వాపోయారు. బోధన్ రోడ్డును ఆనుకుని ఉన్న చెరువుకు కట్ట బఫర్ జోన్ స్థలంలో వెలసిన ఆక్రమణలు చాలా ఉన్నాయన్నారు. దిగువన గల 7ఎకరాల్లో ఉన్న గాడికుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైందన్నారు. రామ్మార్తి చెరువుపై కబ్జాపై జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

త్వరలో ఈ విషయమై రైతులు విలేజ్ కమిటీతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ను రామ్మార్తి చెరువుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టి చెరువుని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ కమిటీ, రైతులు నవీన్, నరసయ్య, గంగాధర్, చెగంటి గంగాధర్, సిర్ప హన్మాండ్లు, అబ్బయ్య రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement