Wednesday, November 20, 2024

మహారాష్ట్ర‌లో భారీ బ‌హిరంగ స‌భ‌.. గులాబీ బాసుల హడావిడి..

నిజామాబాద్ : నాందేడ్ జిల్లాలో గులాబీ బాసులు తమ హడావిడి చేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని లోహ కందార్ నియోజకవర్గాల్లో ఈ నెల 26న తెలంగాణ ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ లో పాల్గొని మహారాష్ట్ర వాసులకు తన ప్రసంగాన్ని అందించనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ సభ సక్సెస్ చేసేందుకు ఇన్ చార్జిగా బాధ్యతలు చేపడుతున్నారు. మహారాష్ట్ర ప్రజల్ని కాకుండా తెలంగాణ వాసులను కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలించి గులాబీ బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు వారి శాయా శక్తుల కృషి చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సైతం గత వారం రోజులుగా నాందేడ్ ప్రాంతంలో మకాం వేసి మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. ఎమ్మెల్యేల అనుచరుల సైతం ప్రతిరోజు పెద్ద ఎత్తున నాందేడ్ ప్రాంతాన్ని చేరుకుని ఆ ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో ఉందని భారతదేశంలో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరిస్తే దేశ ప్రజలందరికి తెలంగాణ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతాయని నాయకులు వివరిస్తున్నారు. నిజాంబాద్ జిల్లాకు ఆదిలాబాద్ కు సరిహద్దు ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు ఉన్న తెలంగాణ గులాబీ పార్టీకి చెందినవారు ప్రతినిత్యం పెద్ద ఎత్తున మహారాష్ట్ర చేరుకొని ప్రచారాన్ని చేపడుతున్నారు. అందరి లక్ష్యం కేసిఆర్ సభను విజయవంతం చేయడమేనని అంటున్నారు. నాందేడ్ జిల్లాలోని శివాజీ నగర్ కడక్పూర్ మాలే కాలనీలో ఆర్మూర్ కు చెందిన అధ్యక్షులు పూజా నరేందర్ పండిత్ ప్రేమ్ సుంకరి రవి దొడ్డి శామ్ సంతోష్ షేక్ అజీమ్ లింగారెడ్డి రియాజ్ గణేష్ కృష్ణ రాజేశ్వర్ జై శ్రీ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement