ప్రభన్యూస్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 7 చెక్ డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందుకు రూ.57కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపా రుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కు మార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని జిల్లా నీటిపా రుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌కు కల్పించారు. నిధుల విడుదలకు ముందు చెక్ డ్యాంలకు సంబందించి ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలోని పెద్దవాగుపై… మోర్తాడ్ మండలం శెట్పల్లి వద్ద, పాలెం-దోన్కల్ గ్రామాల మధ్యన, వేల్పూరు మండలం రామ న్నపేట వద్ద చెక్‌డ్యాంలు మంజూరి అయ్యా యి. అదేవిధంగా కప్పల వాగుపై భీంగల్ మం డలం బెజ్జొర-భీంగల్ గ్రామాల మధ్య, సాలం పూర్-సికింద్రాపూర్ మధ్య, వెల్కటూరు వద్ద చెక్ డ్యాంలు నిర్మాణం కానున్నాయి.
కేసీఆర్‌కు వేముల కృతజ్ఞతలు..
బాల్కొండ నియోజకవర్గానికి 7 చెక్ డ్యాంలు మంజూరు చేయడంపై నియోజకవర్గ రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. ఇటీవలె నియోజకవర్గంలో 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు ఇచ్చిన సీఎం కేసీఆర్.. నేడు 7 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.57కోట్లను మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.