బోధన్ (ప్రభస్ న్యూస్) : బోధన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలైనట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. శనివారం సీఎం కేసీఆర్ను హైదరాబాదులో కలిశారు. బోధన్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సిసి రోడ్ల నిర్మించేందుకు 50 కోట్లు, కబ్రాస్తాన్, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్, చర్చల నిర్మాణానికి 10 కోట్లు, సాతాపూర్ నుండి కందకుర్తికి రోడ్డు నిర్మాణానికి 23 కోట్లు, వినోల నుండి నందిగామ వరకు నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఇక.. ఎంచ నుండి నందిగామ వరకు రోడ్డు నిర్మాణానికి 5 కోట్లు, గాంధీనగర్ సిరంపల్లి లింగాపూర్ వరకు 21 కోట్ల 30 లక్షలు, మావంది కుర్డ్ నుండి పెంటకుర్డ్ రోడ్డు నిర్మాణానికి ఐదున్నర కోట్లు నిధులు, బోధన్ మున్సిపల్ కౌన్సిల్లో పలు అభివృద్ధి పనులు జరుపుటకు 25 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.