కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే గ్రామ శివారులో అదుపుతప్పి పెళ్లి ఆటో బోల్తా పడింది. ఆటోలు ప్రయాణిస్తున్న 15 మందికి గాయాల పాలయ్యారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు సంగోజివాడి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
రేపు ఉదయం వరుడు స్వగ్రామమైన సంగోజువాడి గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురును కన్కల్ గ్రామం నుంచి సంగోజివాడి గ్రామానికి తీసుకొస్తుండగా దేమే గ్రామం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిని వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు.