Friday, November 22, 2024

ఏప్రిల్ 10న నిరసన దీక్షను జయప్రదం చేయండి

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏప్రిల్ 10న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే నిరసన దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిడ్యాల రవీందర్ కోరారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక న్యాయ పూరిత సమస్యల పరిష్కారానికై ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ పెన్షనర్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ వారి పిలుపు మేరకు ఏప్రిల్ 10న సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పెన్షనర్లు అందరికీ క్యాష్ లెస్ మెడికల్ వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రిలలో కల్పించాలని పేర్కొన్నారు. పెన్షన్ లందరికీ ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటవ తేదీన పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరూ అధిక సంఖ్య లో హాజరై నిరసన దీక్ష కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బోజా గౌడ్, జిల్లా కోశాధికారి పి. ఆశయ్య, ఉపాధ్యక్షులు జి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు స్వామి దాస్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement