ఉమ్మడి నిజామాబాద్, ప్రభ న్యూస్ బ్యూరో: 25 ఏళ్లు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ ఇలాంటి అవినీతి మచ్చలేని నేతగా దేశ ప్రజల హృదయాల్లో నిలిచారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వేల కోట్ల కుంభకోణాలతో అవినీతిమమైన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా? లేక ఎలాంటి అవినీతి ఎరుగని నరేంద్ర మోడీ ప్రధాని కావాలా అంటూ అమిత్ షా ప్రశ్నించారు.
దేశానికి ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టి, ప్రపంచంలోనే మూడవ ఆర్థిక దేశంగా నిలపాలంటే మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించిన ఇందూర్ వికాస సంకల్ప సభకు హాజరైన అమిత్ షా ప్రజలనుదేశించి ప్రసంగించారు. రామ మందిర నిర్మాణం 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దాటవేస్తూ వచ్చింది. రామ మందిర నిర్మాణం రాహుల్ బాబా కు ఏ మాత్రం ఇష్టం లేదు. కేసులు ఎత్తివేయించి, రామ మందిర నిర్మాణ ప్రతిష్టాపన మోడీ చేయించారు. ఓటు బ్యాంకు కోసం మజిలీస్, ఓవైసీ అంటే రాహుల్ బాబాకు భయం పట్టుకుందని అమిత్ షా అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని రాహుల్ బాబాకు, ఖర్గే లకు ఆహ్వానాలు పంపిన రాలేదు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ రామ మందిర నిర్మాణానికి రాలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. బిజెపి ఓటు బ్యాంకు కోసం ఏనాడు భయపడదు. అయోధ్య, కాశి మందిరాలను నిర్మించాం. మధురలో కృష్ణ మందిరాన్ని నిర్మించబోతున్నాం. దేశంలో ఉగ్రవాదులను దాదాపుగా ముట్టించాం. నేరుగా పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదుల అంతు తేల్చిన ఘనత మోడీదేనన్నారు.
బీహార్, తెలంగాణ, జార్ఖండ్, ఆంధ్ర ప్రదేశ్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో నక్సలైట్లను పూర్తిగా ఏరివేశాం. మిగిలిన చత్తీస్ ఘడ్ లో మూడోసారి అధికారంలోకి రాగానే నక్సలైట్లను పూర్తిగా ఏరి వేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. …
తెలంగాణలో కాశ్మీర్ కోసం ప్రాణమిచ్చే బిడ్డలు
కాశ్మీర్ తో తెలంగాణ రాజస్థాన్ రాష్ట్రాలకు వచ్చేది ఏముందని ఖర్గే గే మాట్లాడుతున్నాడు. తెలంగాణలో కాశ్మీర్ కోసం ప్రాణమిచ్చే బిడ్డలు ఎందరో ఉన్నారు. 370 ఆర్టికల్ ను కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. మోడీ 370 ఆర్టికల్ ను ఎత్తివేసి కాశ్మీర్ లో జాతీయ జెండాను రేపరెపలాడించారు. 370 ఆర్టికల్ ఎత్తేస్తే కాశ్మీర్లో రక్తం ఏరులై పాడుతుందని రాహుల్ అన్నాడు. కానీ ఒక్క రాయిని కూడా కదపలేకపోయారని అమిత్ షా అన్నారు.
370 ఆర్టికల్ మళ్లీ తెస్తానని రాహుల్ కలలు కనొద్దని అమిత్ షా హితవు పలికారు. దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదని ప్రశ్నించారు. అక్కడ భారత రాజ్యాంగం అమలు జరగకూడదా అంటూ ప్రశ్నించారు. త్రిబుల్ తలాక్ ఎత్తేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛను మోడీ ఇచ్చారు 100చోట్లపై పిఎఫ్ స్థావరాలపై దాడులు చేశామని అమిత్ షా స్పష్టం చేశారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఉగ్రవాదులు తోక ముడిచారని స్పష్టం చేశారు. …
రాష్ట్రంలో ఆర్ ఆర్ అమలు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ అమలవుతోంది. రాహుల్, రేవంత్ టాక్స్ తో నిత్యం కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిపరులతో నిండుగా పోయింది. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది. రామ మందిర నిర్మాణం రాహుల్ బాబాకు ఎంత మాత్రం ఇష్టం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో పూర్తిస్థానాలు బిజెపికి ఇస్తే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. తెలంగాణలో కమలం పువ్వు గుర్తుపై బటన్ నొక్కితే కరెంటు ఇటలీ వరకు వెళ్లాలని అమిత్ షా కోరారు. ఏ అంటే అసదుద్దీన్, బి అంటే బిఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్ మూడు ఏబిసిలు కలిసి ముస్లిం ఓట్ల కోసం పాకులాడు తున్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామనవమి రోజు ర్యాలీలు తీయనియరు. హైదరాబాద్ లో తెలంగాణ విమోచన దినాన్ని జరుపనివ్వరు. రామమందిర ప్రతిష్టాపనకు విరోధులు. ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని, అబద్దాలతో మోసం చేస్తున్న వారిని ఓడించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. …
. ముస్లీం రిజర్వేషన్లు మాత్రమే తొలగిస్తాం
రిజర్వేషన్లు తొలగింపు పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగానే ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఎప్పటి మాదిరిగానే ఎలాంటి మార్పు చేర్పు లేకుండా కొనసాగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పదేళ్ల అధికారంలో రిజర్వేషన్లను మోడి తొలగించారా అని ప్రశ్నించారు. పదేళ్లలో 370 ఆర్టికల్ తొలగించి కాశ్మీర్ లో స్వేచ్ఛ వాయువులు ఇచ్చారు. త్రిబుల్ తలాక్ తొలగించి ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా పుట్టించారు. అందుకే దేశం సుభిక్షంగా ఉండాలంటే మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావలసిన అత్యావశ్యకత ఉందన్నారు.
ఫోటో మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి వెంటపడరని అమిత్ షా అన్నారు. . తప్పులు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో జరిగిన దోపిడి చిట్టా మొత్తం కేంద్రం చేతిలో ఉందని, అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దేశంలో 80 కోట్ల మంది పేదల కోసం రేషన్ గ్యాస్ మరుగుదొడ్లు ఇల్లు నీళ్లు విద్యుత్తు అందించి మోడీ ఎంతో మేలు చేశారని అమిత్ షా గుర్తు చేశారు. మూడోసారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.