నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. . అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, పల్లె గంగారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొననున్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు. పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సంక్రాంతి కానుకగా కేంద్రం పసుపు బోర్డుని తెలుగు రాష్ట్రాలకే కాదు యావద్దేశానికి అందిస్తోందన్నారు.సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానిది క్రియాశీలక పాత్ర అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పసుపు రైతుల చిరకాల వాంఛను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.