Sunday, November 3, 2024

Nizamabad – కేటీఆర్ కు చీపురులతో స్వాగతం పలకండి – ఎంపీ ధర్మపురి పిలుపు

నిజామా బాద్ ప్రతినిధి : (ఆంధ్రప్రభ)బిఆర్ఎస్ పదేండ్ల పాలనలో విచ్చలవిడిగా అవినీతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిప్ప చేతి కిచ్చి న బిఆర్ఎస్… ఇంకా ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. అస లు కేటీఆర్ ది పాద యా త్రనా పదవుల యాత్ర నా అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ చేసిన అఘా యిత్యాలు ప్రజలు ఏనాటికి మరువరని చెప్పారు. పాదయాత్ర పేరున ప్రజల్లోకి వస్తున్న కేటీఆర్ కు చెప్పులతో, చీపుర్లతో స్వా గతం పలకండని పిలు పునిచ్చారు.

ఆదివారం నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఈ ప్రదేశానికి వెళ్తే అక్కడి దేవుళ్ళపై ఓ ట్టేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తెలంగా ణలోని అన్ని పుణ్యక్షేత్రాలపై ఓట్లు వేసి గట్టుమీద పెట్టే సాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు.

వచ్చే స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని పాతాళానికి తొక్కడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చారన్నారు. జా తీయ అధ్యక్షుడు ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. ఇప్పుడు సూక్తులు చెప్పడం కాదు అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో ఖర్గే చదవలేదా అని ప్రశ్నించారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని ఖర్గే వ్యాఖ్యలకు అర్థం అని అన్నారు.

*కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి*

- Advertisement -

కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉందని మండి పడ్డారు. ప్రైవేటుకు ధాన్యా న్ని అమ్ముకొని పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారని వాపోయారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి న రైతులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని ఆరో పించారు. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ 500 బోనస్ ఏమాయే అని ప్రశ్నించారు.

మాయ మాట లు చెప్పడంలో రేవంత్ కెసిఆర్ ని మించిపోయాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ప్రారం భించి వెంటనే 500 బోనాల ప్రకటించాలని డిమాండ్ చేశారు.

. *మంత్రి అయ్యేవరకు లెటర్ ప్యాడ్ లేదంటున్న సుదర్శన్ రెడ్డి*

నిజామాబాద్ జిల్లాకు పెద్ద మనిషిగా గెలిపిస్తే మా కష్టాలు తీరుస్తాడు అను కుంటే బోధన్ నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైందని అన్నారు. సమస్యల కోసం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వద్దకు వెళ్తే… మంత్రి పదవి వచ్చేవరకు ఎలాంటి లెటర్ ప్యాడ్ ఇవ్వనని నా వద్దకు రావద్దని బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి సరిగాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 28 ఇంటిగ్రేటే డ్ పాఠశాలలో మం జూరు అవుతే జిల్లాకు ఒకటి కూడా తీసుకురాలేని దౌర్భా గ్య స్థితిలో జిల్లా కాంగ్రె స్ నాయకులు ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇంటిగ్రేటే డ్ పాఠశాల కూడా లెటర్ ప్యాడ్ వస్తేనే తీసుకు వస్తారా అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గనన ను పకడ్బందీగా నిర్వహిం చాలని సూచించారు. ఇంకా ఎన్ని రోజులు అధికారుల పాలనలో కొనసాగిస్తారని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ గాల్లో లెక్కలేసి పది సంవత్స రాలు పాలన చేసిందన్నారు. కాంగ్రెస్ కూడా అదే మాదిరి వ్యవహరిస్తుందని అన్నారు. హామీలను అమలు చేసే ఏకైక పార్టీ బిజెపి యే నని తెలిపారు.వక్క బోర్డు దుర్మార్గపు చట్టమని ఎంపీ తెలిపారు. ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బిజెపి నాయకులు మాస్టర్ శంకర్, తిరుపతి రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement