నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)11:జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాం గంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమై అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి స్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ప్రగటినగర్ లో గల బిజెపి జిల్లా పార్టీ కార్యాల యంలో జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందన్నారు. రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమ ర్ధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జార్ఖండ్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై రాహుల్, సోనియా ఎందుకు స్పందిం చడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని విమర్శించారు. అవినీతి పాల న, కుటుంబ పాలన దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ గతంలోనే పేర్కొన్నారని తెలిపా రు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక నుంచి తెలంగాణకు రూ.వందల కోట్లు మళ్లించారని ఆరోపించారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబ్బులు వెదజల్లి కాంగ్రెస్ గెలవాలని కుట్రలు పన్ను తుందని. ఆ పప్పులు ఏం ఉడకవని ఎద్దేవాచేశారు. మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని. ఈసారి 400 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచే శారు.
తొమ్మిదిన్నరేళ్లుగా ప్రధాని మోదీ అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని. ప్రపంచదేశాలు ఆయన పాల నను అభినందని స్తున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని, గత కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల అవినీతి బయటపడిందని ఆరోపిం చారు. అవినీతి రహిత పాల నను అందిస్తున్న బీజేపీకే దేశ ప్రజలు మరోసారి పట్టం కట్టాలని సిద్ధమయ్యారన్నారు. స్థానిక సమస్యలు, తదితర అంశాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమా ధానాలిచ్చారు.
సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, ఫ్లోర్డర్ స్రవంతి రెడ్డి. మోర్చాల అధ్యక్షుడు పంచరెడ్డి ప్రవళిక, బీఆర్ శివప్రసాద్. బద్దం కేషన్, ప్రభాకర్,
జిల్లా కలెక్టర్ ని కలిసినఅర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నిజామాబాదు నగరంలోని కలెక్టర్ కార్యాల యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ని కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అర్బన్ నియోజకవర్గం సమస్యలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.