నిజామాబాద్ సిటీ,డిసెంబర్ (ప్రభ న్యూస్ )7:బోర్గం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత పై వెంటనే ప్రత్యేక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనా రాయణ తెలిపారు. విద్యార్థు లకు పురుగుల అన్నం పెట్టడం అని అధికారులపై మండిపడ్డారు. గురువారం నిజామా బాదు నగరంలోని బోర్గం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యా హ్నం భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు.
విషయం తెలుసు కున్న వెంటనే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న విద్యార్థు లను పరామర్శించి… విద్యార్థులు అస్వస్థతకు ఎలా గుర య్యా రని వారి తల్లిదండ్రులతో వివరాలను అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులు త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని వైద్యులతో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు పురుగుల అన్నం పెడుతున్నారని ఇలా విద్యార్థులు స్వస్థతకు గురవడం ఇది రెండో సారి జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు అర్బన్ ఎమ్మెల్యేతో విలపించారు. మధ్యాహ్న భోజనం పై ఏజెన్సీ నిర్వాహకుడి పై గతంలో చాలాసార్లు హెచ్చరించిన ఏజె న్సీ నిర్వాహకుల తీరు మార లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
ఈ సందర్బంగా దన్పాల్ సూర్యనారా యణ మాట్లాడుతూ విద్యార్థుల కి పురుగుల అన్నం పెడు తున్న అధికారులు పట్టించుకోక పోవడంపై అధికారులపై మండిపడ్డారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూలి..నాలి చేసే నిరుపేదలు… తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తే ఇదేనా మీరు వారికీ ఇచ్చే వసతులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2గంటలకు విద్యార్థులు తీవ్ర అస్తస్థకు గురై విరోచనాలు చేసు కుంటే… ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులకు సాయంత్రం వరకు చెప్పక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటివరకు డిఈ వో రాలేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు అంటే పట్టింపు లేదా అని అధికారులని ప్రశ్నించారు.
విద్యార్థుల మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ లను కోరారు. మధ్యాహ్నం భోజనం వికటించడంపై వెంటనే విచా రణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని ఏజెన్సీని రద్దు చేయాలని డీ ఈ వో, అదనపు కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఇల్లేందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్, హరీష్, పవన్, భాస్కర్,ఆనంద్ ఉన్నారు.