Wednesday, November 20, 2024

Review Meeting – నిజ‌మాబాద్ లో త్రిముఖ పోటీ… కృషి చేస్తే ఎంపీ సీటు మ‌న‌దే – కెటిఆర్

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో నిజ‌మాబాద్ స్థానానికి ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా భారాస శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీలో మార్పులుచేర్పులను కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

గెలుపు ఓట‌ములు కొత్త‌కాదు ..

భారాసకు ఎన్నికల్లో గెలుపోటములు కొత్తేమీ కాదని కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి . మాట దాటేస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉపముఖ్యమంత్రి భట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు.

అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో భారాస పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రైతుబంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టికప్పుడు ఎండ‌గ‌డుతూ, వాటిని ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లాలని నేత‌ల‌ను, కార్య‌కర్త‌ల‌ను కోరారు కెటిఆర్ .

ఈ స‌మావేశంలో ఈ సమావేశంలో బీఆర్ఎస్ , బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ కే.కేశవరావు, మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, , మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస‌రావు, , మధుసూధనా చారి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ క‌విత‌,
నిజామాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement