నిజామాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తుల అభ్యున్నతకి పాటిపడుతూ కులవృత్తులను ప్రోత్సహించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతకు పాటుపడిందని తెలిపారు.మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మానికి ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత, టిఎస్ డబ్ల్యూ సిడిసి చైర్మన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నితూ కిరణ్, ముఖ్య అతిథులుగా హాజర య్యారు.
గౌడ కుల సంఘాల సభ్యులు,గీత కార్మికులు ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవ మైన రేణుక ఎల్లమ్మ చిత్రప టానికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లా డుతూ… ఏదైనా శుభ కార్యం చేపడితే కల్లు సాకా పోసి ప్రారంభిస్తమో… అదే విధంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల మొట్ట మొదటి ఎన్నికల సమావేశం గౌడ కులస్తులతో నిర్వ హించ డం సంతోషంగా ఉంద న్నారు. మద్యం దుకాణాల టెండర్లలో గౌడ్ లకు రిజర్వేషన్ ఇవ్వడం తెలంగాణలో నే జరుగు తుంద న్నారు. కుల వృత్తుల అభ్యు న్నతికి పాటు పడే ది .. బీఆర్ ఎస్ ప్రభుత్వ మని తెలిపారు.
గణేష్ గుప్తా గాదు గణేష్ గౌడ్….అన్ని అన్నారూ. ఎన్ని కల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మొట్టమొదటి మీటింగ్ గౌడన్నల తోని మొదల య్యింది…అంటే గణేష్ గుప్తాకు ఎల్లమ్మా తల్లి ఆశీర్వాదంతోని ప్రచారం తోనే మొదలయ్యిం దన్నారు..అంటే , నాకు గట్టి నమ్మకం ఏర్పడింద న్నారు.మద్యం టెండర్లలో 15% గౌడన్నలకు ఇవ్వడం మన కేసీఆర్ గొప్పతనం అన్నా రు.
ఐదు ఎకరాలు భూమి,ఐదు కోట్ల డబ్బులిచ్చి హైదరా బాదులో గీత భవన్ ఏర్పాటు చేయడం కూడా కేసీఆర్ తోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు అధికా రంలోకి వచ్చింది.కానీ చేసింది ఏమిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని …మనది బిఆర్ ఎస్ ప్రభుత్వం కాదు బిసి ల ప్రభు త్వం మనదన్నారు.గతంలో కల్లు అమ్మడానికి తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొనేవారు తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కల్లు డిపోల పునరుద్ధనకు చేయడమే కాకుండా 70 వేల కుటుంబాలకు, గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. గితా కార్మికులు పనిచేస్తుండగా చనిపోతే గతంలో రెండు లక్షల బీమా ఇచ్చేవారని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని పేర్కొ న్నారు.
2014 సెప్టెంబర్ 9న కల్లు డిపోల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఈత, తాటి చెట్లు పెంచడానికి.. భిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు కోట్లు మంజూరు చేసిందని పేర్కొ న్నారు.. అలాగే మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని తెలిపారు. ఆ కలితోపాటు ఆత్మగౌరవం ముఖ్యమని భావిస్తూ గౌడ కులస్తులు గీతా కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని తెలిపారు. అదేవి ధంగా హైదరాబాద్లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పా టు చేశామని తెలిపారు. నిజా మాబాద్ లో గౌడ సంఘ భవ నానికి కోటి రూపాయల నిధు లు ఇచ్చిన ప్రభుత్వం బి ఆర్ఎఫ్ ప్రభుత్వం అని తెలిపారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.
వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రాగానే గౌడ కులస్తుల సంక్షేమానికి మరిన్ని నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి పథకాల్లో అత్యధికంగా బీసీ బిడ్డలే ఉన్నారని తెలి పారు.కల్వకుంట్ల కవితను గౌడ సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు విజీ గౌడ్ , పట్టణ అధ్యక్షుడు సత్య నారా యణ గౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, రమణా గౌడ్ సాయిబాబా గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్ గౌడ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు అలీమ్, పాముల నర్శగౌడ్ విద్యార్థి సంఘ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, జిల్లా లోని గౌడ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.