Wednesday, January 8, 2025

Nizamabad – కెసీఅర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయం

నిజామాబాద్ ప్రతినిధి జనవరి 5:(ఆంధ్రప్రభ)ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్, బీజీపీకి లేదనీ నిజామాబాద్ రూరల్ నియో జకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. బిఆ ర్ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.బిజెపి, బీఆ ర్ఎస్ పై రూరల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ బీఅరెస్గడీల పాలన కుటుంబ పాలనను వద్దనుకొని మార్పు కోరుకొని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించగా కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరు ద్దరించడం జరిగిందన్నారు.

వ్యవసాయానికి సంబంధం లేని భూములకు రైతుబంధు ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.బీఅరెస్ వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇవ్వడం వల్ల రూ.21 వేల కోట్లు దుర్విని యోగం అయ్యాయని మండిపడ్డారు. పంట పండించే వారందరికి ఎన్ని ఎక రాలైనా రైతు భరోసా ఎక రానికి రూ 12 వేలు ఇవ్వా లని కాంగ్రెస్ సర్కార్ నిర్ణ యించిందన్నారు. కౌలు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందను చెప్పారు. 20వేల కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం బడ్జెట్ లో కేటాయింపు చేశామన్నారు. తెలంగాణ లో ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇం డ్లిస్తాం..అర్హులందరికీ జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంద న్నారు. బీఅరెస్ 7లక్షల కోట్ల అప్పు ఇచ్చి పోయినా… పేద వారికి సంక్షేమ ఫలాలు అందే లా కాంగ్రెస్ ముందుకు సాగు తుందన్నారు. అవినీతి పాల నకు కేరాఫ్ గా నిలిచిన బిఆర్ఎస్… కాంగ్రెస్ ప్రభు త్వం పై మాట్లాడడం సిగ్గు చేటన్నారు.

*బీసీల కోసం కవిత ధర్నా హాస్యాస్పదం*

- Advertisement -

పదేళ్ళలో బీఅరెస్ బీసీలకు చేసింది శూన్యం. బీఅరెస్ బీసీ రిజర్వేషన్‌లు27 శాతా నికే పరిమితం చేసింది.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వే షన్లు అమలు చేసి తీరు తామన్నారు.బీసీల కోసంకవిత ధర్నా హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కవితబీసీల పై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందనని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట బీఅరెస్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారనీ ఆరోపించారు.

*కెసిఆర్ ఫ్యామిలీ జైలుకెళ్లడం ఖాయం.*

అవీనీతి పాలన చేసిన కెసిఆర్ ఫ్యామిలీ జైలు కెళ్ళ డం ఖాయమని తీవ్ర స్థా యిలో మండిపడ్డారు. ప్రజల కోసం జైలుకెలతానన్న కేటీఆర్ స్టే ఎందుకు తెచ్చు కున్నారనీ ప్రశ్నించారు. లిక్క ర్ స్కాంలో ఉన్న కవిత సిగ్గు తో తలవంచుకోవాలన్నారు.

*బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు భరోసా ఇచ్చారా?*

బీజెపి భారతీయ జూటా పార్టీ.. పసుపు బోర్డు హామీ ఇచ్చినా ఇప్పటికీ అతీగతీ లేదన్నా రు..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు భరోసా ఇచ్చారా అని రూరల్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.బీజేపి సర్కార్ నల్ల చట్టాల ‘ను తెచ్చి ఆరు వేల మందిని పొట్టన పెట్టు కుంది..

బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందనీ రూరల్ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ఎన్నికల హామీ మేరకురైతు భరోసా రూ. 15 వేలకు బదులు రూ.12 వేలు ఇవ్వ డానికి కారణం కేసీఅర్ చేసిన అప్పులేననీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నిజా మాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, అదే ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement