నిజామాబాద్, నవంబరు29:- తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చెట్టుకు తల్లి వేరు లాంటివారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించిన ‘దీక్షాదివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదని, వటావృక్షమని స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఏదో పీకుతామని శపధాలు చేసిన వైఎస్ , చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి జెండాలు పీక్కోని పోయారు. తెలం గాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేమన్నారు.
సమరోత్సవంతో ‘దీక్షాదివస్ ‘
జై తెలంగాణ నినాదాల హోరుతో సమరోత్సవంతో నిర్వహించిన ‘దీక్షాదివస్’ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు వెల్లువలా తరలి వచ్చారు. దీక్ష దివాస్ సందర్భంగా వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ముందుగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీక్షాదివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,దీక్షా దీవాస్ ఇంచార్జ్ ఫారుఖ్ హుస్సేన్,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,బాజిరెడ్డి గోవర్దన్,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,సీనియర్ నాయకులు రాంకిషన్ రావు,రాజారాం యాదవ్,అలీం,బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.