నిజామాబాద్ సిటీ , జూలై (ప్రభా న్యూస్) 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే బిజెపి పార్టీ అనవ సరమైన ఆరోపణలు చేస్తున్నా రని… బిజెపి అంటేనే బడా జూట పార్టీ అని నగర మేయర్ దండు నీతూ కిరణ్ ఎద్దేవా చేశారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు. ఎమ్మెల్సి కవిత పై నిరాధార ఆరోపణలు చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఆక్సిడెంటల్ ఎంపీ అరవింద్ .. అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా కవిత పై నిరాధార ఆరోపణలు చేయటం అలవాటుగా మార్చుకున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు.
ఎంపీ …వారి నాన్న పీసీసీ అధ్యక్షులు గా ఉన్న ప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్మి కుని సూట్కేసులు మోసిన చరిత్ర మీదని మీ లాగే అంద రూ కమిషన్లకు కక్కుర్తి పడతా రని అనుకోవటం మీ అవివే కనికి నిదర్శనమని అన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తే బయపడటానికి బానిసలు ఎవ రు లేరని ఇక్కడ తెలంగాణ ఆడపడచు ఆరోపణలను, ఈ డీ విచారణ సంస్థలను ధైర్యం గా ఎదురుకున్నారని గుర్తు చేసారు. కేంద్రంలోని అన్ని సంస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కొనియా డుతూ ఉత్తమ అవార్డులను అందిస్తే బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు అవినీతి ఆరోప ణలు చేస్తూ తెలంగాణ ప్రభు త్వానికి వస్తున్న ఆధారణను తక్కువ చేయాలని చూస్తు న్నారని మండిపడ్డారు.
తప్పు డు ఆరోపణలకు, ప్రచారాలకు ప్రజలు తిప్పి కొడతారని అన్నా రు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారని, దశబ్దాల కాలంగా నోచుకోని పెద్దపల్లి, కరీంనగర్ రైల్వే లైన్ పనులు చేసారని, మాధవ్ నగర్ రైల్వే వంతెన పనులకు కృషి చేసార ని, కేంద్రియ విద్యాలయాలను తీసుకువచ్చారని, పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం చేసారని గుర్తు చేసా రు. తెలంగాణ రాష్ట్ర సంస్కృ తి, సంప్రదాయలను దేశ విదేశీ లను వ్యాప్తించే విధంగా కృషి చేసారని పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసారని అక్క పోరాటానికి కేంద్ర ప్రభు త్వం ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తింపు పొందరని ఆ విధం గా పనులు చేసి పోటీపడాలని తెలిపారు.తెలంగాణ రాష్టంలో దళితలకు ఇస్తున్న గౌరవం ఏంటో రాష్టంలో ఉన్న ప్రజలకు తెలుసని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రల్లో దళితులపై, ఆదివా సులపై జరుగుతున్న ఆకృత్యా లు దేశం మొత్తం గమనిస్తుం దని గుర్తు చేసారు.. భవిష్య త్తులో బిఆర్ఎస్ , ఎమ్మెల్సీ కవితపై ఏలాంటి ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు – నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిజెపి పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మండి పడ్డారు. ఎంపీ అరవింద్ ప్రజలు తనకు ఇచ్చిన సేవ చేసే అధికారాన్ని పూర్తిగా దుర్విని యోగం చేసారని ఎటువంటి అభివృద్ధి చేయకుండా పసలేని ఆరోపణలు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రని విభజన చట్టంలో పొందుపరిచిన హామీ లను, మన రాష్ట్రనికి రావల సిన నిధులను గురించి పార్ల మెంట్ సమావేషాల్లో ప్రస్తావిం చి వాటిని సాధించాలని ఇవే మీకు చివరి సమావేశాలని ఇకనైనా చిల్లర వేషాలు మా ని… రాష్ట్రానికి రావలసిన హక్కులను రాబట్టాలని గుర్తు చేసారు. కేంద్రంలోని, రాష్టం లోని బీజేపీ నాయకులు మాట్లాడుతూ మోది రష్యా ఉక్రైన్ యుద్ధన్ని అపారని డబ్బా మాటలు మాట్లా డుతున్నారని మరి ఎందుకు మణిపూర్ అల్లర్లను ఆపలేక పోతున్నారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర నాయ కులు విజయలక్ష్మి, కార్పొరే టర్లు పంచరెడ్డి నర్సుబాయ్ మృధుల, ఉమారాణి, హేమల త, సవిత, సుధా, బట్టు రాఘ వేందర్, కో ఆప్షన్ మెంబర్ చంద్ర కళ, బారాస నగర అధ్యక్షులు గంగామణి, ఎస్టీ సెల్ అధ్యక్షులు చాంగుబాయ్, నూడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్, అరుణ్, శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.