Friday, September 6, 2024

Nizamabad – వామ్మో… రెస్టారెంట్లు- కుళ్ళిపోయిన చికెన్ …నిల్వ ఉంచిన మాంసం.. వాటినే కస్టమర్ లకు సరఫరా..

ఏం.ఎస్ .ఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో త‌నిఖీలు
కుళ్ళిపోయిన చికెన్ …నిల్వ ఉంచిన మాంసం
ప్రాణంతకరమైన టెస్టింగ్ సాల్ట్, కలర్స్ స్వాధీనం…
ఫ్రిజ్లో నిల్వ ఉంచిన రైస్, గ్రేవీ పదార్థాలు

నిజామాబాద్ ప్రతినిధి జూన్ (ప్రభ న్యూస్)20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఘులుపిస్తున్నారు. గురువారం నిజాంబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో గల ఎమ్మెస్సార్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఫ్రిజ్లో నిల్వ ఉంచిన చికెన్, కొన్ని రోజుల క్రితం వండిపెట్టిన చికెన్ లెగ్ పీస్ లు, ప్రాణాంతకరమైన టెస్టింగ్ సాల్టు కలర్స్, ఇతర ఆహార పదార్థాలను పొడిసేట్టి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అంతేకాకుండా ఐదు రోజుల క్రితం వండి ఫ్రిజ్లో నిల్వ ఉంచిన గ్రేవ్ ను , ఆహార పదార్థాలను చెత్తబుట్టలో వేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి టి .నాయక్ హెచ్చరించారు. రెస్టారెంట్లు హోటల్లు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు పరిశుభ్రత పాటించాలని కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement