నిజామాబాద్ సిటీ, జూలై (ప్రభ న్యూస్) 7: నిజామాబాద్ పట్టణంలో నాలు గు సంవత్సరాల క్రితం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించిన భూగర్భ మురుగునీరు శుద్ధి ప్రాజెక్టు సంవత్సరాలు గడు స్తున్న ఎందుకు ముందుకు సాగడం లేదని, రూ 246 కోట్ల కమిషన్ల కోసమే తప్ప ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ప్రయోజనం మాత్రం అందించలేకపోయారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నిజామాబాద్ నగరం లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్య క్షులు కేశ వేణు ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న దశాబ్ది దగా కార్య క్రమం లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొని పట్టణ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టును, ప్రభుత్వ ఆసుప త్రిని, ప్రభుత్వ వైద్య కళాశా లను సందర్శించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లా డుతూ మురుగు నీటిని శుద్ధి చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రాజెక్టుకు ఇప్పటివరకు నగరం లోని ఇళ్లకు మురుగునీటి కనెక్ష న్ ఇవ్వకపోవడం సిగ్గుచేట ఆయన అన్నారు. డ్రైనేజీ సిస్టం ద్వారా మురుగు నీటిని తీయడంలో ఈ ప్రాజెక్టు పని తీరు సరిగా లేదని నగరంలో మురుగునీరు ద్వారా దోమలు, ఇతరత్రా క్రిమి కీటకాలు చేరి పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతు న్నారని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రూ246 కోట్లతో ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెప్పా రు తప్ప ప్రాజెక్టు పని తీరును పర్యవేక్షించలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్ప టికైనా ప్రజాప్రతినిధులు అధికా రులు కళ్ళు తెరిచి నగరంలోని అన్ని ప్రాంతాలకు డ్రైనేజీ సిస్టం మెరుగుపరిచి మొరుగునీటిని సేకరించి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజల ఆరో గ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ ఆసుప త్రిలో రోగుల కు అన్ని రకాల మౌలిక వసతు లు కల్పించ డంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేసి పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టు కొని వారికి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కాంగ్రె స్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి , పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాద వ్ ,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్య క్షులు వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాక ర్ ,రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేంద ర్ గౌడ్ ,పిసిసి కార్యదర్శి రాం భూపాల్ ,జిల్లా కాంగ్రెస్ ఉపా ధ్యక్షులు దయాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంతి రెడ్డి రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, అబూద్ బీన్ హమ్దాన్, సేవాదళ్ సంతోష్, పీసీసీ డెలిగేటి ఈసా ,నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం ,అబ్దుల్ ఎజాజ్, గంగారెడ్డి, అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.