Wednesday, December 4, 2024

Nizamabad – ఏడాదిలో మీరు సాధించేందేమిటి .. రేవంత్ కు ధన్ పాల్ లేఖ

నిజామాబాద్ ప్రతినిధి డిసెంబర్3: (ఆంధ్రప్రభ) – కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పాలనలో ప్రజ లకు ఏమి చేశారో సమాధా నం చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనా రాయణ డిమాండ్ చేశారు. అభివృద్ధి సంగతి దేవు డెరుగు.. విజయో త్సవాల పేరిట ప్రజాదనం దుర్వి నియోగం చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై వెంటనే సమాధానం చెప్పాలని సీఎంకి నేడు బహిరంగ లేఖ పంపారు.


నిజాంబాద్ నగరంలోని ఆజాం రోడ్ వద్ద గల పెద్ద పోస్ట్ ఆఫీస్ కార్యాలయం నుంచి ఈ లేఖను సిఎంకు పోస్ట్ చేశారు. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు ఏం చేసారని ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రజా ధనాన్ని దుర్వి నియోగం చెయ్యడానికి నాంది పలికారని ధ్వజ మెత్తారు.. ఏకకాలంలో రైతులకు రూ2 లక్షల రుణ మాఫీ పూర్తి స్థాయిలో జర గనందుకు మీరు చేసిన వాగ్దానం నెరవేర్చనందుకు ఈ విజయోత్సవాలా అని ప్రశ్నించారు.

రైతులకు,కౌలు రైతులకు 15000 రూ. రైతుభరోసా ఇవ్వనందుకు ఈ విజయోత్సవాలా.. వ్యవ సాయ కూలీలకు 12000 రూ.ఇవ్వడంలో విఫల మైనందుకు ఈ విజ యోత్సవాలా అని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ సంవత్సర పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు న్యాళం రాజు, బిజెపి ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ కృష్ణ, బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement