Sunday, July 7, 2024

Nizamabad – నామినేషన్ వేసిన బిజెపి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)8: కమిషన్లకు…కబ్జాలకు.. మాఫియాకు అడ్డాగా నిజామాబాద్ నగరాన్ని మార్చేశారని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారా యణ అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్య ర్థిగా ధన్ పాల్ సూర్యనారా యణ నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇందూరు కాషాయమయంగ్గా మారింది. బిజెపి పార్టీ శ్రేణుల ఆధ్వ ర్యంలో నామినేషన్ వేయ డానికి బయలుదేరిన ధన్ పాల్ కు ఇందూరు ప్రజలు సంబు రంగా స్వాగతం పలికారు. నిజా మాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున జన సందోహం తరలివచ్చారు. ఈ ర్యాలీ నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతం నుంచి శివాజీ చౌక్ పెద్ద బజార్ గాంధీ చౌక్ బస్టాండ్ మీదుగా కోర్టు చౌరస్తా వరకు నిర్వహించారు. తూర్పు గోదావరి నుంచి వచ్చిన వారి వినూత్న వేషధారణ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాజా భజంత్రీలతో.. డప్పు వాయిద్యాలతో.. ఆడప డుచుల మంగళ హారతులతో ధన్పాల్ సూరన్నకు గజమా లతో ఘనంగా స్వాగతం పలి కారు… సూరన్నకు అడుగ డు గునా ఇందూరు ప్రజలు నీరాజ నం పలికారు. వేలమంది ప్రజ లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని సూరన్నకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. అంతకు ముందు కార్యకర్తలు ధన్పాల్ సూర్యనా రాయణ ఇంటికి చేరుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసు కున్నారు. ప్రజలు మంగళ హారతులతో డప్పుచప్పులు, బాజాభజంత్రీలతో అడు గడుగునా సందడి చేశారు. అనంత‌రం రిట‌ర్నింగ్ కార్యాల‌యంలో ఆయ‌న త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

.ఈ కార్యక్రమం లో ఈ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, మహారాష్ట్ర ఎమ్మెల్యే రాజేష్ పడివి, జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పోతంకర్ లక్ష్మి నారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం,జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, వెంకటేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బంటు రాము పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, బూరుగుల ఇందిరా వినోద్,సుక్క మధు,పంచారెడ్డి లావణ్య,ఇప్పకాయల సుమిత్ర కిషోర్,ఇల్లేందుల మమతా ప్రభాకర్,చందుపట్ల వనిత శ్రీనివాస్, మెట్టు విజయ్, బంటు వైష్ణవి,మీసాల సవిత శ్రీనివాస్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, రోషన్ లాల్ బోర బిజెపి నాయకులు కార్యకర్తలు, ఇందూరు ప్రజలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement