Saturday, January 4, 2025

Nizamabad – ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు

నిజామాబాద్ (ఆంధ్రప్రభ)32: స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేసిన పత్రికగా ఆంధ్రప్రభ తెలుగు ప్రజల్లో తనదైన ముద్ర వేసు కుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మం తు అన్నారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యా లయంలోని తన ఛాంబర్ లో 2025 సంవత్సర ఆంధ్రప్రభ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవి ష్కరిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రభ పత్రికను కొనియాడారు. నేటికీ అవే జర్న లిజం విలువలను పాటిస్తూ, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పని తీరును ప్రజలకు చెరవేయడంలో ఆంధ్రప్రభ కృషి అభినందనీయమన్నారు.

దాదాపు ఎనిమిది దశాబ్దాలు పూర్తి చేసుకున్న అత్యంత పురాతన పత్రికను ఇంకా విలువలతో కూడి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. మారు తున్న కాలానికి అనుగుణం గా వినూత్నంగా పత్రిక రూపాంతరం చెందుతూ ప్రజలు, అధికారులకు చేరువ కావడం గొప్ప విషమని కలెక్టర్ అన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల సమస్యల్ని అధికార యంత్రాంగానికి చేరవేసే వారధిగా ఆంధ్రప్రభ ఇక ముందు కూడా ప్రత్యేక ఒరవడి కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు.

- Advertisement -

ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ యూనిట్ మేనేజర్ వెంకటేష్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ నరసింహా చారి, నిజామాబాద్ ప్రతినిధి ఇంగు శ్రీనివాస్ గుప్తా, సర్కులేషన్ మేనేజర్ దామోదర్ రెడ్డి, ఆర్మూర్, బోధన్ ఆర్.సి ఇంచార్జీలు మహేష్, ఉమాకాంత్, ఏర్గట్ల రిపోర్టర్ శివ, ఆర్మూర్ టౌన్ రిపోర్టర్ చక్రధర్ ,స్టాఫ్ ఫోటో గ్రాఫర్ సీతారే కృష్ణలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement