Tuesday, November 26, 2024

NZB : శాంతికి మారు పేరు నిజామాబాద్ నగరం.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల

శాంతి భద్రతల కు మొదటి ప్రాధాన్యత ని ఇస్తూ నిజామా బాద్ నగరాన్ని సేఫ్ సిటీ గా మార్చామనీ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. మంగళ వారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థి గణేష్ బిగాల 19, 20 వ డివిజన్ లలోని నీల కంట నగర్,విద్యుత్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కురుమ కాలనీ, బ్యాంక్ కాలనీ, క్రిస్టియన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్
నిజామాబాద్ నగరం లో అన్ని సదుపాయాలు ఉండటం వల్లే అంతర్జాతీయ కంపెనీలు నిజామాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి నిజామాబాద్ వస్తు న్నాయన్నారు. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కావా లం టే హైదరాబాద్, బెంగళూర్, పూణే వెళ్ళవలసి వచ్చేదన్నారు. ఐటి హాబ్ నిర్మాణంతో మన నిజామాబాద్ బిడ్డలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ సంతో షంగా ఉన్నారన్నారు.అభివృద్ధి లో భాగంగా నిజామాబాద్ నగరం లో మినీ ట్యాంక్ బండ్ ని అద్భుతంగా నిర్మించామనీ అన్నారు.ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణం చేసి ప్రజలకు ట్రాఫిక్ గోస నుండి విముక్తి కల్పించామ న్నారు.చివరి మజిలీ గౌరవంగా సాగేందుకు అధునిక సదుపా యాలతో వైకుంఠ దామలు నిర్మాణం చేసామన్నారు. మరోసారి నన్ను ఆశీర్వదిస్తే ప్రతి ఇంటికి 24 గంటలు మంచి నీరు అందిస్తామన్నారు.ప్రతి ఇంటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కనెక్షన్ ని ఉచితంగా ఇస్తామ న్నారు.అన్న పూర్ణ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి సన్న బియ్యం ఇస్తామన్నారు.400 రూ.లకే వంట గ్యాస్ ని ఇస్తా మని హామీ ఇస్తున్నామ‌న్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను కొనసాగించుటకొరకు మరోసారి కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ బి.ఆర్.ఎస్ నాయకులు జగత్ రెడ్డి, జె.గంగమని, కొండవత్రి రాజేందర్,ఇరుమల శంకర్ 20 డివిజన్ మాజీ కార్పొరేటర్ గోపరి సుగుణ లక్ష్మణ్, నాయిని సుజన్, యెండల ప్రసాద్,వేముల భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే..
నిజామాబాద్ జిల్లాకు బుధ వారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పర్యటించను న్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని జి.జి.కాలేజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వదా సభ వద్ద ఏర్పాట్ల ను బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో బి.ఆర్.ఎస్ నాయకు లు ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి, సత్య ప్రకాష్,ముచుకుర్ నవీన్, నర్సింహ,రాజేంద్ర ప్రసాద్,కరిపే రాజు తదితరులు పాల్గొన్నారు.
43వ డివిజన్ లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం..
43వ డివిజన్ లో బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్. ఆర్.ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం,విశాలిని రెడ్డి,ఎర్రం గంగధర్, బొబ్బిలి మురళి,ఆర్ఎల్‌ నర్సింహ,కొండపాక రాజేష్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement